
పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలి
దంతాలపల్లి: వర్షాకాలంలో గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని డీపీఓ హరిప్రసాద్ అన్నారు. మండలంలోని బీరిశెట్టిగూడెం, దాట్ల గ్రామాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా వీధులను పరిశీలించారు. అనంతరం కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడా రు. వర్షాకాలంలో గ్రామాలను శుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. కార్యదర్శులు, కార్మికులు గ్రామాలను శుభ్రంగా ఉంచేందుకు కృషి చేయాలన్నారు. అనంరతం గ్రామాల్లో నిర్మాణాల్లో ఉన్న ఇందిరమ్మ ఇళ్ల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కృష్ణయ్య, కార్యదర్శులు, మల్లికార్జున్, భూలక్ష్మి, జీపీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.