
ఆర్టీసీ బస్సును ఢీకొని యువకుడి మృతి
● పాలకుర్తిలో ఘటన
పాలకుర్తి టౌన్ : బైక్‌పై అతివేగంగా వెళ్తూ ఆర్టీసీ బస్సును ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన గురువారం మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై దూలం పవన్‌కుమార్ కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గాడిపెల్లి రంజిత్(20) హైదరాబాద్‌లోని ఓ వైన్ షాపులో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో బైక్‌పై మైలారం నుంచి పాలకుర్తి మీదుగా జనగామ వెళ్తుండగా జనగామ నుంచి పాలకుర్తికి వచ్చి బస్తాండ్‌లోకి వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొన్నాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు క్షతగాత్రుడిని 108లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా, ఆర్టీసీ బస్సును ఢీకొన్న రంజిత్ హెల్మ్‌ంట్ ధరించి ఉంటే బతికేవాడు.