
నర్సంపేట డిగ్రీ కళాశాల సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుద
కేయూ క్యాంపస్: కేయూ పరిధిలోని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల( అటానమస్) రెండు, నాల్గవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గురువారం కేయూలో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ఆ కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మల్లం నవీన్ ఫలితాల వివరాలు వెల్లడించారు. బీఎస్సీలో 41.74 శాతం, బీఏలో 51.85శాతం, బీకాంలో 39.92శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.ఈ ఫలితాలను క్యూ ఆర్ కోడ్, లింక్ ద్వారా కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ కళాశాల పరీక్షల నియంత్రణాధికారి ఎస్. కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి రాజీరు, స్టాఫ్‌సెక్రటరీ రహీముద్దీన్, భద్రు, తదితరులు పాల్గొన్నారు.
17న హనుమకొండలో గిరిజన మార్కెటింగ్ మేళా
ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ట్రైబల్ ఫెడరేషన్ మార్కెటింగ్ (ట్రైఫాడ్) ఆధ్వర్యంలో ఈనెల 17న హనుమకొండలోని గిరిజన భవన్‌లో హస్తకళా ప్రదర్శన, మార్కెటింగ్ మేళా నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ఏటూరునాగారం పీఓ చిత్రామిశ్రా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేళాలో గిరిజన కళాత్మక హస్తకళల (దుస్తుల తయారీ, పెయింటింగ్, ఫుడ్ ప్రొడక్ట్స్, వెదురు బుట్టలు అల్లడం) ప్రదర్శన ఉంటుందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆసక్తిగల గిరిజన కళాకారులు తాము తయారు చేసిన వస్తువులను ప్రదర్శించడానికి మేళాకు హాజరు కావాలని కోరారు. ఈ ప్రదర్శనకు హాజరయ్యే కళాకారులు తప్పని సరిగా కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. మేళాకు హాజరైన కళాకారులకు రవాణా చార్జీలను ట్రైఫాడ్ ద్వారా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 8330954571 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
యువకుడిపై పోక్సో కేసు
పాలకుర్తి టౌన్: ప్రేమపేరుతో మాయమాటలు చెప్పి బాలికపై పలుమార్లు లైంగికదాడికి పా ల్పడిన ఘటనలో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్‌కుమార్ తెలిపారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ బాలికపై( 16 ఏళ్లు) మండలంలోని తీగారం గ్రామానికి చెందిన దండెంపల్లి ప్రణయ్ లైంగికదాడికి పాల్పడగా ఆ బాలి క గర్భం దాల్చింది. ప్రస్తుతం 6 నెలల గర్భవతి అని తెలియడంతో ప్రణయ్.. ఆ బాలికకు గర్భస్రావం కోసం టాబ్లెట్లు ఇచ్చాడు. ఇంటికి వెళ్లాక సదరు బాలిక టాబ్లెట్లు వేసుకోగా రక్తస్రావం అయ్యింది. గమనించి కుటుంబ సభ్యులు బాలికను నిలదీశారు. దీంతో విషయం బయటపడింది. ప్రస్తుతం బాలికను హనుమకొండలోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై దూలం పవన్‌కుమార్ తెలిపారు.

నర్సంపేట డిగ్రీ కళాశాల సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుద