
సైబర్ మోసగాళ్ల బరితెగింపు..
జనగామ: సైబర్ మోసగాళ్ల బరితెగించారు. పహల్గాం దాడి కుట్రలో సంబంధాలు ఉన్నాయంటూ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వైద్యుడు, ఐఎంఏ ప్రతినిధి లకావత్ లక్ష్మీనారాయణ నాయక్‌కు పహల్గాం ఉగ్రదాడి ఘటనలో సంబంధాలపై విచారణ ఉందంటూ గుర్తుతెలియని వ్యక్తులు గురువారం ఫోన్ చేసి భయపెట్టే ప్రయత్నం చేశారు. ‘హలో లక్ష్మీనారాయణ గారు పహల్గాం ఉగ్రదాడి విచారణ అధికారిని మాట్లాడుతున్నా.. ఆ దాడి వెనక మీకు సంబంధాలు ఉన్నాయని తెలిసింది.. విచారణకు రావాల్సి ఉంటుంది, లేదంటే వెబ్‌సైట్ ద్వారా రిపోర్టు చేయాలి’ అని బోల్తాకొట్టించాడు. అయితే సైబర్ నేరస్తుడిపై డాక్టర్ లక్ష్మీనారాయణకు అనుమానం కలిగింది. పహల్గాం ఘటన కు తనకు సంబంధం ఉంటే పూర్తి సమాచారం స్థానిక పోలీసులకు ఇస్తానని, అక్కడ నుంచి తీసుకోవాలని తెగేసి చెప్పడంతో అనుమానితుడిగా భావించిన సైబర్ నేరస్తుడు ఫోన్ కట్ చేశాడు. వెంటనే జనగా మ సీఐ దామోదర్‌రెడ్డికి గుర్తుతెలియని వ్యక్తి సంభాషణను పంపించి, ఇందుకు సంబంధించి విషయాలు వివరించారు. అగంతకుల బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తే ఎవరూ భయపడొద్దని, వ్యక్తిగ సమాచారం ఇవ్వొద్దని డాక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు.
పహల్గాం దాడికి
సంబంధాలంటూ బెదిరింపు
విచారణకు రండి.. లేదా వెబ్‌సైట్‌లో రిపోర్టు చేయాలి
డాక్టర్‌ను బురిడీ కొట్టించే ప్రయత్నం
పోలీసులకు ఫిర్యాదు