
ఎమ్మార్టీ విభాగంలో ఉపయోగం లేని ఎఎల్‌ఎం పోస్టుల సృష్టి..
ఎమ్మార్టీ విభాగానిది
కీలక పాత్ర..
టీజీ ఎన్పీడీసీఎల్‌లో ఎమ్మార్టీ విభాగానికి కీలక భూమిక. సబ్ స్టేషన్లు, డీటీఆర్‌ల నిర్వహణ్యలో వీరి పాత్ర కీలకం. వీటితోపాటు సీటీ, హెచ్‌టీ, ఎల్‌టీ మీటర్లను రోటేషన్ పద్ధతిలో పరీక్షిస్తుంటారు. సబ్ స్టేషన్లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల మెయింటెనెన్స్ బాధ్యత కూడా వీరిదే. ఏ మాత్రం అలసత్వం వహించినా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగడమో, నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అదే విధంగా డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్ల లోపాలను సరిదిద్దేది ఈ విభాగం ఉద్యోగులే. విద్యుత్ శాఖలో కీలక పాత్ర పోషిస్తున్న వీరిపై యాజమాన్యం వివక్ష ధోరణి అనుసరించడంతో విసిగిపోతున్నారు.