
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
దంతాలపల్లి: ప్రజలు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో దోమలు కుట్టడం వల్ల వచ్చే డెంగీ, మలేరియా, చికెన్‌గున్యా వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఇంటి ఆవరణలో దోమల నివారణకు చర్యలు తీసుకునేలా ప్రజలకు వివరించాలన్నారు. వేడి ఆహారం, కాచి చల్లార్చిన నీళ్లు మాత్రమే తాగాలని సూచించారు. అనంతరం ఆస్పత్రిలో అందుతున్న వైద్యసేవల గురించి అడిగి తెలసుకున్నారు. ఆస్పత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య పెంచాలని సూచించారు. రిజిస్టర్లు తనిఖీ చేసి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వైద్యులు కవిత, రమ్య, క్లస్టర్ సీహెచ్‌ఓ కుసుమ విద్యాసాగర్, నర్సింగ్ ఆఫీసర్ పద్మ, సూపర్‌వైజర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.
ప్రజలను అప్రమత్తం చేయాలి
నెల్లికుదురు: సీజనల్ వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని పీహెచ్‌సీని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కుసుమ విద్యాసాగర్‌తో కలిసి సోమవారం సందర్శించి రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య, రజని, పీహెచ్‌ఎన్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.