
సమ్మెను జయప్రదం చేయండి
నెహ్రూసెంటర్: దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, పనిగంటల పెంపును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ, ఏఐటీయూసీ. ఐఎఫ్‌టీయూ, టీయూసీఐ, కార్మిక సంఘాల నాయకులు కుంట ఉపేందర్, రేషపల్లి నవీన్, శివ్వారపు శ్రీధర్, ఎస్‌కే మదార్, కొత్తపల్లి రవి మాట్లాడుతూ.. కార్మికులు ఈనెల 9న దేశవాప్తంగా జరిగే సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పని గంటల తగ్గింపు, లేబర్‌కోడ్‌ల రద్దు, కార్మిక సంక్షేమ బోర్డు ఏర్పాటు, కార్మికులకు కనీస వేతనం అమలు వంటి డిమాండ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నెరవేర్చాలని అన్నారు. కార్యక్రమంలో ఆకుల రాజు, కుమ్మరికుంట్ల నాగన్న, సమ్మెట రాజమౌళి, గారే కోటేశ్వర్‌రావు, మంద శంకర్, చెక్కల సోమయ్య, మధుసూదన్, జక్క రయ్య, పర్వత కోటేష్, హలా వత్ లింగ్యా, కృష్ణ, భాస్కర్‌రెడ్డి, బండపల్లి వెంకటేశ్వర్లు, వంగూరి వెంకన్న, బిల్లకంటి సూర్యం, పాయం చంద్రన్న, సత్యం, పాపారావు తదితరులు పాల్గొన్నారు.