
నవోదయలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలి
మహబూబాబాద్: నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో అడ్మిషన్ల కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026–27 విద్యాసంవత్సరానికి నోటిఫికేషన్ విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఈనెల 29వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్థానికులై ఉండాలని, 2025–26 విద్యాసంవత్సరంలో ఐదో తగతి చదువుతూ ఉండాలన్నారు. 2014 మే 1నుంచి 2016 జూలై 31వ తేదీ మధ్య జన్మించిన వారు మాత్రమే అర్హులన్నారు. ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4 తరగతులు పూర్తి చేసి ఉండాలన్నారు. 2025 డిసెంబర్ 13న పరీక్ష ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9110782213, 7993263431 నంబర్లలో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో వరంగల్ నవోదయ పాఠశాల ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, ఉపాధ్యాయుడు సురేశ్, లైబ్రేరియన్ లక్ష్మా రెడ్డి పాల్గొన్నారు.