
నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలి
డోర్నకల్: జిల్లాలో నర్సరీ నిర్వాహకులు నిబంధనలు పాటించాలని జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ అధికారి జినుగు మరియన్న ఆదేశించారు. పలు గ్రామాల్లో మిరప, కూరగాయల నర్సరీలను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సరీ నిర్వాహకులు యాజమాన్య పద్ధతులతో పాటు నియమ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. నారుకు సంబంధించిన రైతుల వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని, ఆరుబయట నారు పెంచొద్దని సూచించారు. లైసెన్స్ లేకుండా ఎలాంటి విక్రయాలు చేపట్టొద్దని, నిబంధనలు పాటించని, నకిలీ విత్తనాలతో నారు పెంచేవారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నర్సరీదారులు, రైతులు పాల్గొన్నారు.