
అక్టోబర్‌లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు
నయీంనగర్: వరంగల్‌లో అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్.దివ్యజ రాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్‌లో వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ నూతన కార్యవర్గం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యజ రాజ్ మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రి, క్రీడా దుస్తులు ఇస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ఎస్.నూతన్, మెడ్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళన
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 2021–2022 పీహెచ్‌డీ నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికే అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పించిన విషయం విధితమే. అయితే తమకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు కల్పిస్తామని గతంలో చెప్పారని, ఉన్నత విద్యామండలి నుంచి సిఫార్సు చేసినా అడ్మిషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు అభ్యర్థులు సోమవారం వీసీ చాంబర్‌లో ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఆందో ళన చేసిన వారిలో మంద నరేశ్, బొట్ల మనోహర్, మోతే రాజు, ఎస్. అనిల్, తిరుపతినాయక్ ఉన్నారు.

అక్టోబర్‌లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు