
దాతలారా.. ఆపన్నహస్తం అందించండి..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల నవీన్‌కుమార్ (36) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మంచంపై కదల్లేని స్థితిలో దీనావస్థలో జీవితం సాగిస్తున్నాడు. అతని భార్య కవిత మూగ, చెవిటికాగా, కూతురు నివేదిత ఉన్నారు. నవీన్‌కుమార్ స్థానికంగా కరెంటు స్విచ్ బోర్డుల తయారు చేసే కాంట్రాక్టర్ వద్ద రోజుకు రూ.300 దినసరి కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని కష్టంమీద పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి హైబీపీ రావడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. గతంలో వారానికి రెండు రోజులపాటు డయాలసిస్ చేయగా, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని విశ్వాస్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిన్ జరుగుతోంది. ఇందుకోసం ప్రతీనెల రూ.2లక్షల మేర ఖర్చు అవుతుండంతో భరించలేని స్థితిలో నవీన్‌కుమార్ కుటుంబం ఉంది. చెడిపోయిన రెండు కిడ్నీల స్థానంలో ఓ కిడ్నీ అయినా ఏర్పాటు చేస్తే తన ప్రాణం నిలిచే అవకాశం ఉందని నవీన్‌కమార్ చెబుతున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ‘జీవన్‌దాన్’ పథకం కింద కిడ్నీ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుని 8 నెలల అవుతున్నప్పటికీ కిడ్నీ దాతలు లభించడం లేదు. దాతలెవరైనా ఉంటే 99493 49660 సెల్ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం అందించాలని బాధితుడి తండ్రి రత్నం కోరుతున్నారు.
రెండు కిడ్నీలు చెడిపోయి దీనావస్థలో బాధితుడు
నిమ్స్‌లో ‘జీవన్‌దాన్’కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం
చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్