
టీ–హబ్‌తో ఒప్పందంపై మంత్రిని కలిసిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి కేయూ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రీయ ఉన్నత విద్య అభియాన్ (రూసా) నిధులతో కేయూలో ఏర్పాటుచేసి కె–హబ్ గురించి మంత్రికి వివరించారు. యువతలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, అంకుర స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యం ఉందని వీసీ తెలిపారు. ఇంక్యుబేషన్, స్టార్టప్‌లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లోని టి–హబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సహకరించాలని మంత్రితో చర్చించారు. అలాగే, జీయాలజీ విభాగానికి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాట చేయాలనే అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని వీసీ తెలిపారు. ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిలవాలని మంత్రి కాంక్షించారని ప్రతాప్‌రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపస్‌లో వెల్లడించారు. వీసీ వెంట కేయూ జీయాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారు.