
ఉద్యోగ విరమణ సహజం : కలెక్టర్
మహబూబాబాద్: ప్రతీ ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ సహజమని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వీర బ్రహ్మచారి పదవీ విరమణ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అంకితభావంతో విధులు నిర్వర్తించిన అధికారులను ప్రజలు జీవితాంతం గుర్తు పెట్టుకుంటారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ గణేశ్, డీఎస్పీ తిరుపతి రావు, జెడ్పీ సీఈఓ పురుషోత్తం, కలెక్టరేట్ ఏఓ పవన్‌కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.