
కంపు.. కంపు!
‘ఈ ఫొటోలో మురికి కూపంగా కనిపిస్తున్న ప్రాంతం మహబూబాబాద్ పట్టణంలోని గోగుల మల్లయ్య బజార్. నాసిరకంగా డ్రెయినేజీ నిర్మాణం చేపట్టడంతో కొద్దిరోజులకు కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతంలో నివాస గృహాల నుంచి వచ్చే మురుగు నీరు ఒకేచోట చేరుతోంది. దీనిని సరిగ్గా తీయకపోవడంతో చెత్తాచెదారంతో నిండి కంపు కొడుతోంది. బాటసారులు అక్కడికి రాగానే ముక్కు మూసుకుని ముందుకు వెళ్తున్నారు.’
● ‘ఫొటోలో కనిపిస్తున్న ఇళ్ల మధ్య మురికి నీటి కుంట కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అంబేడ్కర్ సెంటర్ సమీపంలోనిది. కాలనీ నుంచి వచ్చే మురుగు నీరు బయటకు వెళ్లేందుకు సరైన కాల్వలు లేవు. దీంతో ఒకే చోటకు చేరి చెరువును తలపించింది. మురికి కూపంలో పందులు, కుక్కలు స్వైర విహారం చేయడం, ఆహార పదార్థాలు, ఇతర చెత్త కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతోంది.’
● ‘పక్క ఫొటోలో కనిపిస్తున్న మురికికాల్వ డోర్నకల్ మున్సి పాలిటీలోని బ్యాంకు స్ట్రీట్‌లోనిది. నెలల తరబడి కాల్వలు తీయకపోవడంతో మురుగునీటితో నిండిపోయాయి. దీనికి తోడు చెత్త, గృహ నిర్మాణాలకు వినియోగించే ఇటుకలు, కంకర కాల్వలో పడి నీరు ముందుకు కదలడం లేదు. కాల్వ ను శుభ్రం చేయకపోవడంతో పక్కనే గడ్డి మొలిచింది. అంతా కుళ్లిపోయి కాల్వ కంపు కొడుతోంది.’

కంపు.. కంపు!

కంపు.. కంపు!