
రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలి
మహబూబాబాద్ రూరల్: రైల్వే మూడో లైన్ నిర్మాణం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించాలని రైల్వే డీఆర్‌ఎం భరతేష్ కుమార్ జైన్‌ను ఎమ్మె ల్యే భూక్య మురళీనాయక్ కోరారు. సికింద్రాబాద్ రైల్ నిలయంలో డీఆర్‌ఎంను సోమవారం ఎమ్మెల్యే కలిసి పలు సమస్యలను ఆయ న దృష్టికి తీసుకెళ్లారు. మహబూబాబాద్ పట్టణంలోని ఏ క్యాబిన్ రైలు గేట్ మూసివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దీనికి శాశ్వత పరిష్కారంగా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరారు. కేసముద్రం మండలం అన్నారం గ్రామంలో అండర్ బ్రిడ్జి మరమ్మతులు త్వరగా పూర్తిచేయాలని కోరారు. అలాగే మానుకోట రైల్వేస్టేషన్‌లో జీటీ, ఏపీ, వందేభారత్, రప్తిసాగర్, హింసాగర్, సంఘమిత్ర సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ డీఈ ఉపేందర్ ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్: జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పని చేస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల నుంచి 2025 విద్యా సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ రవీందర్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు జూలై 13 తేదీ లోపు http://nationalawards toteachers.education.gov.in వెబ్‌సైట్ ద్వారా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కోసం రిజిస్ట్రేషన్ చేసుకొని, రెండు పత్రాలను సంబంధిత ఎంఈఓతో, పాటు ఈనెల 14న సాయంత్రం 5.00గంటల లోపు డీఈఓ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పెండింగ్ బిల్లులు
క్లియర్ చేయాలి
కురవి: ఉద్యోగుల పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి అన్నారు. సోమవారం మండలంలోని రాజోలు ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణ కోసం డీఈఓ, డిప్యూటీ ఈఓ, ఎంఈఓ, కాంప్లెక్ హెచ్‌ఎంలను వినియోగించాలని డిమాండ్ చేశారు. అవసరమైనచోట కొన్ని అదనపు పో స్టులను మంజూరు చేయాలని, ప్రత్యేక యంత్రాంగం ద్వారా మాత్రమే పర్యవేక్షణ చేపట్టాలన్నారు. పర్యవేక్షణ కోసం ఉపాధ్యాయులను నియమించడాన్ని ఉపసంహరించుకోవా లన్నారు. యూపీఎస్‌ల పర్యవేక్షణ కోసం ఎంఈఓతో పాటు అకడమిక్ పోస్టును అదనంగా సృష్టించాలని డిమాండ్ చేశారు. ఉన్నత పాఠశాలల పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్‌కు ఉప విద్యాధికారిని నియమించాలన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మురళీకృష్ణ, షేక్‌యాకూబ్, ఎం.ప్రవీణ్‌కుమార్, రమ్య, అస్మత్‌పాషా, డీఎస్ శ్రీనివాస్, భవాని, విజయరాణి, దయతబిత, సుభాషిణి తదిత రులు పాల్గొన్నారు.