
వినతులు వెంటనే పరిష్కరించాలి
మహబూబాబాద్: ప్రజావాణి దరఖాస్తులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్,అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలన్నారు సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. పరిష్కారం సాధ్యం కాకపోతే కారణాలతో కూడిన నివేదిక అందజేయాలని సూచించారు. ప్రజావాణిలో 148 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్