
ఇంటర్ లింక్‌తో నిరంతర విద్యుత్
హన్మకొండ : విద్యుత్ అవసరాలు రోజురోజుకూ పె రుగుతున్నాయి. ఈ క్రమంలో అంతరాయాలతో వినియోగదారులు ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో టీజీ ఎన్పీడీసీఎల్ పెద్ద ఎత్తున ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు చేపట్టింది. ఇందులో భాగంగా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసింది. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన, మెరుగైన విద్యుత్ సరఫరా జరుగుతుంది. దీని కోసం ప్రతీ సబ్ స్టేషన్ మధ్య ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ నిర్మించింది. తదనుగుణంగా 11 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్ల వ్య వస్థపై కూడా దృష్టి సారించింది. అవసరమైన లైన్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించింది. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో ఒక లైన్‌లో లేదా సబ్ స్టేషన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిన లేదా నిలిపివేయాల్సిన ఆవశ్యకత ఏర్పడితే ఆయా లైన్ లేదా సబ్ స్టేషన్ పరిధిలోగల విద్యుత్ 33 కేవీ ఇంటర్ లింక్ లైన్ వ్యవస్థ ఒక 33/11కేవీ సబ్ స్టేషన్ నుంచి మరో 33/11 కేవీ సబ్ స్టేషన్‌కు, అదే విధంగా 33 కేవీ లైన్ నుంచి మరో 33 ౖకేవీ లైన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా అందిస్తారు. దీంతో మరమ్మతులు చేసిన సమయంలో, మరే ఇతర కారణాల వల్ల ఒక లైన్‌లో విద్యుత్ సరఫరా చేస్తే ఆ ప్రాంత విద్యుత్ వినియోగదారులకు అంతరాయాలు లేకుండా ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ ద్వారా విద్యుత్ సరఫరా చేస్తారు.
ఆరు ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి..
వరంగల్ సర్కిల్ పరిధిలోని 33/11 కేవీ సబ్ స్టేషన్లు, 33 కేవీకి చెందిన 16 లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 6 ఇంటర్ లింకింగ్ లైన్ల నిర్మాణం పూర్తి చేశారు. పది 33/11కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. హనుమకొండ సర్కిల్ పరిధిలోని డైబ్బె నాలుగు 33/11 కేవీ సబ్ స్టేషన్‌లో అయిదు 33 కేవీ లైన్లలో ఇంటర్ లింకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 72 సబ్ స్టేషన్లలో పనులు పూర్తయ్యాయి. మరో రెండు 33/11 కేవీ సబ్ స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. మూడు 33 కేవీ లైన్లులలో ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్ల నిర్మాణం జరుగుతోంది.
వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన కరెంట్
ప్రత్యామ్నాయ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసిన టీజీఎన్పీడీసీఎల్
ప్రత్యేక కార్యాచరణతో ముందుకు ..
వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ప్రత్యేక కార్యాచరణ తో ముందుకెళ్తున్నాం. కొన్ని లైన్ల నిర్మాణానికి రైల్వే క్రాసింగ్‌ల వద్ద రైల్వే అధికారుల అనుమతి రావాల్సి ఉంది. ఈ మేరకు రైల్వే అధికారులను అనుమతి కోరాం.
– పి.మధుసూదన్ రావు,
ఎస్‌ఈ, హనుమకొండ
వినియోగదారులకు నిరంతర విద్యుత్
వినియోగదారులకు నిరంతర విద్యుత్ అందించేందుకు అన్ని చర్యలు చేపట్టాం. టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ప్రత్యామ్నాయ లైన్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించారు. వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
– కె.గౌతం రెడ్డి, ఎస్‌ఈ, వరంగల్

ఇంటర్ లింక్‌తో నిరంతర విద్యుత్

ఇంటర్ లింక్‌తో నిరంతర విద్యుత్