
భూ వివాదంతో రైతు ఆత్మహత్య
గార్ల: భూ వివాదంతో మనస్తాపం చెందిన ఓ రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆది వారం పెద్దకిష్టాపురంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గంగావత్ మోహన్ (38) అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద 3 ఏళ్ల క్రితం భూమి కొనుగోలు చే శాడు. ఈ భూమిని పట్టా చేసుకునేందుకు మోహన్ పలుమార్లు విక్రయించిన రైతు వద్దకు వెళ్లాడు. అయితే ఆ వ్యక్తి పట్టా చేయడానికి రెవెన్యూ కార్యాలయానికి రావడం లేదు. ఈ సమస్య 3 ఏళ్లుగా కొ నసాగుతోంది. దీంతో భూమి తన పేరుపై ఇంకా ప ట్టా కావడం లేదనే మనస్తాపంతో మోహన్ శనివా రం రాత్రి తన పొలం వద్ద పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం ఇవ్వడంతో క్షతగాత్రుడిని మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రియాజ్‌పాషా తెలిపారు.