‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి | - | Sakshi
Sakshi News home page

‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి

Jun 30 2025 4:25 AM | Updated on Jun 30 2025 4:25 AM

‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి

‘కొండా’కు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి

హన్మకొండ చౌరస్తా: గత ఎన్నికల్లో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలను తామే గెలిపించామని పదేపదే చెబుతున్న కొండా మురళీకి దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో స్టేషన్‌ఘన్‌పూర్‌ , వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కేఆర్‌.నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ, ‘కుడా’ చైర్మన్‌ ఇనుగాల వెంకట్రామ్‌రెడ్డి, వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ సమావేశం అయ్యారు. అనంతరం స్వర్ణ, నాగరాజు, వెంకట్రామ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్సీ సారయ్య మీడియాతో మాట్లాడారు. గత 38 సంవత్సరాలుగా కాంగ్రెస్‌ పార్టీని బతికించామని చెబుతున్న కొండా మురళికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీ అన్నారు. పార్టీలు మారలేదంటున్న కొండా కుటుంబం అన్నీ పార్టీలు మారారని.. కాంగ్రెస్‌ పార్టీకి చేసిన పని ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. షోకాజ్‌ నోటీసు ఇస్తే హైదరాబాద్‌కు వెళ్లిన మురళి తననెవరూ పిలవలేదంటూనే క్రమశిక్షణ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాట్లాడుతూ నాడు ప్రాణభయంతో రామసహాయం సురేందర్‌రెడ్డి వద్దకు వెళ్లిన కొండా మురళికి డీజీపీతో చెప్పి గన్‌మెన్లను ఇప్పించి ప్రాణభిక్ష పెట్టారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి గురించి మురళి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని, ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడడం సరికాదని హితవుపలికారు. జూలై 5 వరకు అధిష్టానం సమయం ఇచ్చిందని.. అప్పటి వరకు ఎదురుచూస్తామని అన్నారు. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ మా మీద కొండా మురళి సవారీ చేయడం సరికాదని, తన గెలుపునకు ఎలాంటి సహాయం చేయలేదన్నారు. కొందరి కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వేధించారని, అలాంటి పనులు చేయొద్దని కోరారు. ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, శ్రీహరి మాట్లాడుతూ.. వచ్చే నెల 4న ఏఐసీసీ చీఫ్‌ ఖర్గే రాక నేపథ్యంలో జనసమీకరణ అంశంతో పాటు, వరంగల్‌ జిల్లా అభివృద్ధి, నిధుల సమీకరణపై సీఎం రేవంత్‌రెడ్డితో సమీక్ష నిర్వహించేందుకు ఆయన అపాయింట్‌మెంట్‌పై సుదీర్ఘంగా చర్చించామని చెప్పారు. కొండా మురళి వ్యాఖ్యలు, క్రమశిక్షణ కమిటీకి అందించిన నివేదికపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అధిష్టానం ఇచ్చిన సమయంలో సరైన నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య

మురళికి సురేందర్‌రెడ్డి

ప్రాణభిక్ష పెట్టాడు

వరంగల్‌ డీసీసీ అధ్యక్షురాలు

ఎర్రబెల్లి స్వర్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement