
దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాల ఏర్పాటు
మరిపెడ రూరల్: మామిడితోట మధ్యలో ఓ వ్యక్తి రాత్రికిరాత్రే దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఇది తెలిసిన తోట యజమాని పు రుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్ప డ్డాడు. ఈ ఘటన మ రిపెడ మండలం రాంపురంలో ఇటీవల చోటు చేసుకోగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. బాధితుడి కుమారుడు రాజాకుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మాడుగుల ఉపేందర్‌కు ఐదున్న ర ఎకరాల్లో మామిడి తోట ఉంది. ఈ క్రమంలో తోట పక్కన గెట్టు ఉన్న అదే గ్రామానికి చెందిన చింతపల్లి మల్లయ్య మామిడితోట మధ్య నుంచి తన బోరు మోటారుకు విద్యుత్ కోసం ఈ నెల 19వ తేదీన అర్ధరాత్రి స్తంభాలు, తీగలు ఏర్పాటు చేశాడు. ఈ విషయం తెలిసి తోట వద్దకు వెళ్లిన ఉపేందర్ మనస్తాపానికి గురై అక్కడే గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు సూర్యాపేటలోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, చింతపల్లి మల్లయ్య .. విద్యుత్ అధికారుల అనుమతులు లేకుండా, తమకు తెలియకుండా మామిడి తోట మధ్య దౌర్జన్యంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశాడని ఉపేందర్ కుమారుడు రాజాకుమార్ తెలిపాడు. మా నాన్న ఉపేందర్ ఆత్మహత్యాయత్నానికి కారణమైన మల్లయ్యపై చర్యలు తీసుకుకోవాలని కోరాడు. మల్లయ్యపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 19న తానే స్వయంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసులో ఎలాంటి పురోగతి లేదని ఆరోపించాడు.
మనస్తాపంతో పురుగుల మందు తాగిన మామిడితోట యజమాని
మండలంలోని రాంపురం గ్రామంలో
ఆలస్యంగా వెలుగులోకి..
మరిపెడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
చేసినా పట్టింపు కరువు