
ఫోన్ ట్యాంపరింగ్‌లో దయాకర్‌రావు
హసన్‌పర్తి: ఫోన్ ట్యాంపరింగ్‌లో మాజీ మంత్రి దయాకర్‌రావు ప్రమేయం ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ ఒకటో డివిజన్ పరిధిలో రూ.1.78కోట్లతో నిర్మిస్తున్న సీసీరోడ్ల పనులకు నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పర్వతగిరి కేంద్రంగా ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని, ఇందుకు స్పష్టమైన ఆధారాలు లభ్యమైనట్లు చెప్పారు. ఫోన్ ట్యాంపరింగ్‌లో దయాకర్‌రావు జైలుకు వెళ్లడం ఖాయమని, ఆయనకు చిన్న మెదడు చిట్లి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నాడన్నారు. వర్ధన్నపేట కేంద్రంగా వంద ఎకరాల్లో యంగ్‌ఇండియా ఇంటిగ్రేడెడ్ స్కూల్‌తో పాటు సబ్‌జైలు, మున్సిఫ్ కోర్టు, స్టేడియం నిర్మించడానికి ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. వర్ధన్నపేట ఎమ్మెల్యేగా మూడు పర్యాయాలు కొనసాగిన దయాకర్‌రావు అక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాదిన్న కాలంలోనే అభివృద్ధి శరవేగంగా జరుగుతోందని అన్నారు. సమావేశంలో కార్పొరేటర్ అరుణకుమారి, మాజీ సర్పంచ్ దేవరకొండ అనిల్‌కుమార్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు వెంకటేశ్వర్లు, మాజీ వార్డు సభ్యుడు గడ్డం శివరాంప్రసాద్, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా మాజీ అధ్యక్షుడు వీసం సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆయన జైలుకు వెళ్లడం ఖాయం
వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు