
బైక్‌పైనుంచి పడిన మహిళ..
● చికిత్స పొందుతూ మృతి
చిట్యాల: ద్విచక్రవాహనంపై నుంచి పడిన ప్రమాదంలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన జయశంకర్ భూ పాలపల్లి జిల్లా చిట్యాలలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన చింతకింది రాజమణి (57) పని నిమిత్తం బైక్‌పై ఈనెల 27న రేగొండ మండలం కాకర్లపల్లెకు వెళ్తోంది. ఈ క్రమంలో తిర్మలాపూర్‌లో పంది అడ్డు వచ్చింది. దీంతో కింద పడగా తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానిక సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి ఆదివారం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మారమ్గధ్యలో మృతి చెందింది. మృతురాలి కుమారుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రావన్‌కుమార్ తెలిపారు. మృతురాలికి భర్త రవీందర్, కుమారుడు రామకృష్ణ ఉన్నారు.