
విద్యార్థుల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
మహబూబాబాద్: పాఠశాలలో విద్యార్థుల చదువుపై ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లో విద్యాశాఖ అధికారులతో విద్యా తదితర విషయాలపై కలెక్టర్ శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ.. వినూత్న పద్ధతులతో విద్యాబోధన చేయాలన్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధవహించాలన్నారు. ఎంఈఓ ప్రతి రోజు కనీసం ఒక పాఠశాలనైనా సందర్శించాలని తెలిపారు. టైంటేబుల్ ప్రకారం సెలబస్ పూర్తి చే యాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారం అందించాలని తెలిపారు. జిల్లాలో వయోజన విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టి గ్రామీణాభివృద్ధి శాఖ సమన్వయంతో అక్షరాస్యత పెంచాలన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల అడ్మిషన్లు పెంచాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఈఓ రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మదార్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహైస్కూల్, పీహెచ్‌సీని శనివారం ఆయన సందర్శించారు. జెడ్పీ హైస్కూల్‌లోని తరగతులను పరిశీలించి, విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థుల నైపుణ్యాలను గుర్తించి ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నట్లు వివరించారు. సీజనల్ వ్యాధులపై వైద్య ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. రికార్డులను మెయింటెన్స్ చేయాలన్నారు. మాతా శిశుమరణాలు, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. కార్యక్రంమలో డాక్టర్ విరాజిత, హైస్కూల్ హెచ్‌ంఎం వాహిద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్