
కొమ్మకొమ్మకో గూడు..!
పక్షుల ఆవాసమైన గూళ్లు అందంగా.. ఆకర్షనీయంగా ఉంటాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యంతో పలు పక్షి జాతులు అంతరించిపోయాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే పక్షులు తమ జీవనాన్ని సాగిస్తున్నాయి. ఈక్రమంలో వాటికి అవసరమైన ఆవాసాలను అవే నిర్మించుకోవడం మనకు తెలిసిందే.. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ సమీపంలోని ఓ బావి వద్ద ఉన్న చెట్లుపై పక్షుల గూళ్లు.. ప్రతి కొమ్మకూ ఉన్నాయా.. అన్నట్లుగా కన్పిస్తూ ఆకట్టుకుంటున్నాయి..
– నెహ్రూసెంటర్