
ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి
మహబూబాబాద్ రూరల్: క్షణికావేశంలో చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ అన్నారు. మహబూబాబాద్ జైలు లో ఉన్న ఖైదీలకు అందుతున్న వసతులు, సౌకర్యాలపై ఆయన శనివారం సందర్శించి ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి జైలులో ఉన్న వివిధ బ్యారక్ లను తిరిగి ఖైదీలతో మాట్లాడారు. వారికి అందుతున్న నీరు,ఆహారం, పరిశుభ్రత, వైద్య సౌకర్యాల గురించి సబ్ జైల్ సూపరిండెంటెంట్ మల్లెల శ్రీనివాసరావును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా అబ్దుల్ రఫీ మాట్లాడుతూ ఖైదీలకు భవిష్యత్‌లో ఇదే చివరి జైలు జీవితం కావాలని, ఉచిత న్యాయ సహాయం, లోక్ అదాలత్, శిక్ష తగ్గింపు (ప్లీ బార్గేయినింగ్) మొదలైన వాటి గురించి ఖైదీలకు వివరించారు. జైలు జీవితాన్ని తమ భవిష్యత్‌కు సోపానంగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జైల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావు, భిక్షపతి డిప్యూటీ జైలర్ సదా నిరంజన్, అదనపు డిప్యూటీ జైలర్ ఖాజా ఖలీలుద్దీన్, హెడ్ వార్డర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ప్రధాన న్యాయమూర్తి
మహమ్మద్ అబ్దుల్ రఫీ