
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్‌ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్‌ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్‌ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్‌ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్‌ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్‌ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు.
రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ