ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య | - | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

Jun 29 2025 2:57 AM | Updated on Jun 29 2025 2:57 AM

ఫైనాన

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో ఘటన

హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా

పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?

కాజీపేట: ఓ ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌ జేపీఎన్‌ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్‌కుమార్‌ (55) ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్‌సీఐ, ప్రైవేట్‌ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్‌ఎస్‌ షెడ్‌లో పనిచేసే గడ్డం ప్రవీణ్‌కుమార్‌కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్‌కుమార్‌ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్‌కుమార్‌ రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లి నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్‌.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్‌కుమార్‌ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.

హత్య కేసులో విభిన్న వాదనలు ..

ఫైనాన్స్‌ వ్యాపారి నవీన్‌కుమార్‌ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్‌ బౌన్స్‌ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్‌కుమార్‌ను నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్‌లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్‌ వ్యాపారి నవీన్‌కుమార్‌ హత్య సమాచారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఘటనా స్థలికి పోలీసు అధికారులు..

కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌ రెడ్డి, ఇన్‌చార్జ్‌ సీ ఐ పుల్యాల కిషన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్‌, క్రైమ్‌ సిబ్బంది, క్లూస్‌ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్‌కుమార్‌ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్‌కుమార్‌ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది.

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య1
1/1

ఫైనాన్స్‌ వ్యాపారి దారుణ హత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement