పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే | - | Sakshi
Sakshi News home page

పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే

Jun 29 2025 2:57 AM | Updated on Jun 29 2025 2:57 AM

పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే

పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే

హసన్‌పర్తి: వచ్చే ఎన్నికల్లో పక్కాగా వంద అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నగరంలోని నాని గార్డెన్‌లో శనివారం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ గులాబీ వైపు చూపుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కనీసం సాగు నీరు అందించకుండా వారి కళ్లల్లో కన్నీళ్లు నిలిపిందన్నారు. నాట్లకి..నాట్లకి రైతుబంధు కేసీఆర్‌ వేస్తే.. రేవంత్‌ మాత్రం ఓట్లకు ఓట్లకు రైతు భరోసా వేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఓ అబద్దాల కోరుగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మొట్టు శ్రీనివాస్‌, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్‌రావు, రాధికారెడ్డి, నాయకులు శ్రీధర్‌, అటికం రవీందర్‌, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మార్గం భిక్షపతి, అప్పారావు, బండి రజనీకుమార్‌, తూర్ల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్‌, పాడి మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, జోరుక రమేశ్‌ పాల్గొన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement