
రైల్వేస్టేషన్‌లో దొంగ అరెస్ట్
● రూ. 2.86 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం
● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్
రామన్నపేట : వరంగల్ రైల్వేస్టేషన్‌లో ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ. 2,86,645 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో నాలుగో ఫ్లాట్‌ఫామ్ వద్ద చింతల్ వైపున తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 28.645 గ్రాముల బంగారం చైన్, రెండు పుస్తెలు, 3 జతల చెవి కమ్మలు లభ్యమయ్యాయి. నిందితుడు ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బంగారం చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రామకృష్ణ, రమేశ్. మనోజ్‌కుమార్‌ను జీఆర్పీ సీఐ అభినందించారు.

రైల్వేస్టేషన్‌లో దొంగ అరెస్ట్