
స్నాతకోత్సవానికి సమన్వయంతో పనిచేయాలి
కేయూ క్యాంపస్: జూలై 7న నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఆయా కమిటీల కన్వీనర్లు, మెంబర్లను కోరారు. ఇప్పటికే స్నాతకోత్సవం నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీ, 10 సబ్ కమిటీలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం నియమించారు. అన్ని కమిటీల కన్వీనర్లతో శుక్రవారం క్యాంపస్‌లోని అకాడమిక్ కమిటీ హాల్‌లో వీసీ ప్రతాప్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవం స్టీరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 331 మంది విద్యార్థులు పీహెచ్‌డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 374 మంది విద్యార్థులకు 564 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, స్ట్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆచార్య మల్లారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ వెంకట్రామ్‌రెడ్డి, ప్రొఫెసర్ మల్లికార్జున్‌రెడ్డి, అమరవేణి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ షమిత, ప్రొఫెసర్‌వై వెంకయ్య, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి