
ప్రభుత్వం చేసే పనులను ప్రజలకు తెలపాలి
తొర్రూరు: రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచి పనులను గ్రామాల్లోని ప్రజలకు తెలపాలని టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సీరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో క్లస్టర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, పార్టీ కోసం కష్టపడిన నాయకులను సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీలుగా గెలిపించుకోవాలన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, సన్న బియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్, సబ్సిడీ గ్యాస్ అందిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితం అందించాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్, నాయకులు డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, చాపల బాపురెడ్డి, పెదగాని సోమయ్య, జాటోతు నెహ్రూ, ఎర్రబెల్లి రాఘవరావు, జలకం శ్రీనివాస్, పింగిళి ఉష, వల్లపు యాకయ్య, అలువాల సోమయ్య, దొంగరి శంకర్, జాటోతు రవి, బచ్చలి లక్ష్మణ్, వల్లపు మల్లయ్య పాల్గొన్నారు.