
ట్రాఫిక్ కష్టాలు..
మహబూబాబాద్: జిల్లా కేంద్రం కొత్తబజారు మోడ ల్ మార్కెట్ ఎదుట ఉన్న రోడ్డు (పాత తొర్రూ రు బస్టాండ్ సెంటర్)లో ఏర్పాటు చేసిన పార్కింగ్ అ డ్డాతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. అక్కడ ఆటోలు, ద్విచక్రవాహనాలు, కార్లు పార్కింగ్ చేయడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రం కావడంతో ఆ రోడ్డు నిత్యం రద్దీగా ఉంటుంది. కాగా వాహనాల పార్కింగ్‌తో పాటు ఆరోడ్డుకు ఇరువైపులా చిరువ్యాపారులు తోపుడు బండ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య జఠిలమైంది.
ఇటీవల నెహ్రూసెంటర్‌లో తొలగింపు..
ఇటీవల నెహ్రూసెంటర్‌లో ఉన్న పార్కింగ్ అడ్డాను పోలీసులు తొలగించారు. ఆ ప్రాంతంలో మార్క్ చేసి, వాహనాలను పార్కింగ్ చేస్తే రూ.1000 జరి మానా విధిస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీంతో ఆప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తీరింది. ఆరోడ్డు గుండా రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడేవారు. ప్రస్తుతం పార్కింగ్ తొలగించడంతో వాహనదారులు సాఫీగా వెళ్తున్నారు. కాగా పాత తొర్రూరు బస్టాండ్ సెంటర్‌లో ఉన్న పార్కింగ్ అడ్డాను తొలగించి ట్రాఫిక్ కష్టాలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.
మానుకోటలోని మోడల్‌మార్కెట్ ఎదుట పార్కింగ్ అడ్డా ఏర్పాటు
వాహనదారులు, ప్రజలకు తప్పని తిప్పలు