
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం
మహబూబాబాద్ రూరల్: డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో గురువారం భారీర్యాలీ నిర్వహించారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పోతో కలిసి కలెక్టర్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మత్తు పదార్థాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థుల తల్లిదండ్రుల సహకారంతో మత్తు పదా ర్థాలను నియంత్రించవచ్చన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ పిల్లలతో ప్రతీరోజు మాట్లాడటం ద్వారా ఇష్టాలు, లక్ష్యాలు తెలుస్తాయని, ఒకవేళ మంచికి భిన్నమైన ఆలోచనలతో ఉంటే వాటిని ఆపే అవకాశం ఉంటుందన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో ఎంతో ముఖ్యమైందన్నారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మాట్లాడుతూ.. డ్రగ్స్ నియంత్రణలో పోలీసుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు, పాఠశాల స్థాయి నుంచే డ్రగ్స్‌పై అవగాహన ఉండాలని, తద్వారా డ్రగ్స్ రహిత స మాజాన్ని చూడగలుగుతామన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ ధనమ్మ, డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, జిల్లా ఎకై ్సజ్ అధికారి కిరణ్, డీఎస్పీ తిరుపతిరావు, తహసీల్దార్ చంద్రరాజేశ్వర్, సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ ఎస్.నాగవాణి, టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశవర్కర్లు, సఖీ సిబ్బ ంది, మహిళలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే ధ్యేయం