
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
మహబూబాబాద్ అర్బన్/మహబూబాబాద్ రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని విద్యాశాఖ వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాల, అనంతారం మోడల్ స్కూల్, మహబూబాబాద్ మండలంలోని బ్రాహ్మణపల్లి ప్ర భుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు. మధ్యాహ్న భోజన నిర్వాహకులు, విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడి గి తెలుసుకున్నారు. ఆర్జేడీ సత్యనారాయణ మాట్లాడుతూ.. సర్కారు బడుల్లోనే సుశిక్షుతులైన ఉపాధ్యాయులు ఉంటారని, ప్రతి విద్యార్థి ఆ తరగతి గది అభ్యసన సామర్థ్యాలు సాధించాలన్నారు. పాఠశాల ఆరంభం నుంచే పదో తరగతి విద్యార్థులను ఉపాధ్యాయులు వార్షిక పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌ల్లో విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి వారి సామర్థ్యాలను తెలుసుకున్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు కూరగాయలు, గుడ్లు, మిక్స్‌డ్ వెజిటబుల్ బిర్యానీ అందించాలన్నారు. బ్రాహ్మణపల్లి పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని, గార్డెనింగ్ ఆహ్లాదకరంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల అభివృద్ధికి ప్రధానోపాధ్యాయుడు చేపడుతున్న కార్యక్రమాలు, ఉపాధ్యాయులు పనితీరును ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, ఏఎంఓ చంద్రశేఖర్‌ఆజాద్, కోఆర్డినేటర్ పూర్ణచందర్, ఎంఈఓ వెంకటేశ్వర్లు, పాఠశాలల హెచ్‌ఎంలు ఆరుద్ర వెంకటేశ్వర్లు, దారావత్ భద్రునాయక్, మోడల్ స్కూల్ ప్రిన్సి పాల్ ఉపేందర్, ఉపాధ్యాయులు పాలకుర్తి మౌని క, మాడిశెట్టి సూర్యప్రకాశ్, గొట్టిముక్కల పవన్ రాజ్, బొమ్మర కృష్ణమూర్తి, రాచకొండ ఉపేందర్, కుప్పం సూర్యతేజ, బానోత్ శంకర్ పాల్గొన్నారు.
ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి