
టైమ్స్‌స్క్వేర్‌లో అరుణ్‌కుమార్ ఫొటోల ప్రదర్శన
హన్మకొండ కల్చరల్ : ప్రతిష్టాత్మక డిజిటల్ డిస్‌ప్లే న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ బిల్‌బోర్డుపై భూపాలపల్లికి చెందిన ఫొటోగ్రాఫర్ అరుణ్‌కుమార్ నలిమెల తీసిన మూడు ఫొటోలు ప్రదర్శించారు. మూడు రోజులు జరిగిన ఎన్‌ఎఫ్‌టీ ఎన్‌వైసీ(నాన్ ఫంజిబుల్ టోకెన్– న్యూయోర్క్ సిటీ)–2025 కార్యక్రమంలో భాగంగా అరుణ్‌కుమార్ ఫొటోలు ఈ బిల్‌బోర్డుపై ప్రదర్శించారు. మిస్ వరల్డ్ –2025 పోటీల్లో భాగంగా రామప్ప దేవాయంలో భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన నందినిగుప్తా ఫొటోగ్రాఫ్, యునెస్కో వరల్డ్ హెరిటెజ్ సైట్ రామప్ప దేవాలయం సందర్శన సమయంలో తీసిన ఫొటో, మహిళలు బతుకమ్మ పేరుస్తున్న దృశ్యాన్ని బిల్‌బోర్డుపై ప్రదర్శించారని అరుణ్‌కుమార్ తెలిపారు.