
విషసర్పాలతో తీరని విషాదం..
టేకుమట్ల: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రానికి చెందిన బొల్లు శ్రీనివాస్(55) కొన్ని సంవత్సరాలుగా మండల కేంద్ర సమీప గ్రామం అంకుషాపూర్‌లో ఉంటున్నాడు. భార్య, కుమారుడు హైదరాబాద్‌లో ఉండగా శ్రీనివాస్ ఒంటరిగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్ మంగళవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాము కాటుకు గురయ్యాడు. తెల్లవారుజామున స్థానికులకు తెలపడంతో వారు చికిత్స నిమిత్తం చిట్యాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
దంట్లకుంటతండాలో బాలుడు..
మరిపెడ రూరల్: మహబూ బాబాద్ జిల్లా మరిపెడ మండలం దంట్లకుంటతండాకు చెందిన గుగులోత్ భీమ్య, నీల దంపతులు కవల కుమారుడు రమేశ్ (4) తల్లి నీలతో కలిసి బుధవారం అర్ధరాత్రి ఇంట్లో కింద నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో రమేశ్‌ను పాము కాటు వేసింది. అ నంతరం అదే పాము ఇంటి ఎదుట ఉన్న కోళ్ల గూ టిలోకి వెళ్లడంతో కోళ్లు అరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు నిద్ర లేచి గూటిలో చూడగా పాము కాటుతో రెండు కోడి పిల్లలు మృతి చెంది కనిపించాయి. అనుమానంతో తల్లిదండ్రులు ఇంట్లోకి వచ్చి చూడగా బాలుడికి పాము కాటు గుర్తులు, రక్తం కనిపించింది. దీంతో లబోదిబోమంటూ చికిత్స నిమిత్తం అదేరోజు రాత్రి ఖమ్మం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ గురువారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
విషసర్పాలతో తీవ్ర విషాదం అలుముకుంది. అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో పాములు కాటు వేయడంతో ఓ వ్యక్తి, ఓ బాలుడు మృతి చెందాడు. దీంతో ఆ రెండు కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి. ఈ ఘటనలు జయశంకర్‌భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో చోటు చేసుకున్నాయి.
పాముకాటుతో ఇద్దరి మృతి
టేకుమట్ల, దంట్లకుంటతండాలో ఘటనలు
శోకసంద్రంలో మృతుల కుటుంబాలు

విషసర్పాలతో తీరని విషాదం..