
పెరుగుతున్న వరద ప్రవాహం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీకి గురువారం వరద ప్రవాహం పెరిగింది. మహారాష్ట్రలో కరుస్తున్న వర్షాలతో వరద కాళేశ్వరం మీదుగా తరలివస్తోంది. దీంతో మేడిగడ్డ వ ద్ద 85 గేట్లను ఎత్తి ఉంచడంతో 5,400 క్యూసెక్కుల నీరు దిగువకు తరలుతోంది. మొత్తం 16.17 టీ ఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల బ్యారేజీలో ప్రస్తుత వరద ప్రవాహం నది మట్టానికి 89.10 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రవాహం