కురవి: మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయ్‌లెట్స్ నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. మండల కేంద్రంతోపాటు సూదనపల్లి తదితర గ్రామాల్లోని పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులను గత ప్రభుత్వ హయాంలో మన ఊరు–మనబడి కార్యక్రమంలో ప్రారంభించారు. వాటికి నిధులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు పనులను మధ్యలో నిలిపివేశారు. దీంతో పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో మూత్రశాలలు, మరుగుదొడ్లు వినియోగంలోకి రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. బాలికలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. వీరికి తోడు మహిళా ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. నిధులు కేటాయించి పనులను పూర్తి చేస్తేనే అందరికి ఉపయోగపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. లేకుంటే వానాకాలంలో విద్యార్థులు నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
అసంపూర్తిగా మరుగుదొడ్ల నిర్మాణాలు
నిధుల లేమితో మధ్యలోనే ఆగిన పనులు
ఆందోళన చేస్తాం..
ప్రభుత్వ పాఠశాలల్లో మూత్రశాలల సమస్యను పరిష్కరించాలి. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్ల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయించాలి. లేకుంటే పాఠశాలల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
– గంధసిరి జ్యోతిబసు,
ఎస్‌ఎఫ్‌ఐ నాయకుడు
ఒంటికి, రెంటికి ఇబ్బందులు..
ఒంటికి, రెంటికి ఇబ్బందులు..