
మాదకద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం
మహబూబాబాద్ అర్బన్: మత్తుపదార్థాలతో విద్యార్థులు, యువత బతుకులు చిన్నాభిన్నం అవుతున్నాయని, యువత బంగారు భవిష్యత్ నాశనం చేసుకోవద్దని షీటీం ఎస్సై సునంద అన్నారు. ఎస్పీ ఆదేశాల మేరకు బుధవారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ నియంత్రణ వారోత్సవాల సందర్భంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం సిరి నాయక్, ఉపాధ్యాయులు వాసుదేవ్, రవీందర్, ఉమెన్ సెల్ ఎస్సై ఆనందం, రమేశ్, పార్వతి, సౌభాగ్య పాల్గొన్నారు.
బయ్యారం: విద్యార్థులు మాదకద్రవ్యాలకు అలవాటు పడితే బంగారం లాంటి జీవితాలు చిన్నాభిన్నం అవుతాయని డీఎస్పీ తిరుపతిరావు అన్నారు. మండలంలోని నామాలపాడు ఏకలవ్య పాఠశాల ఆవరణంలో బుధవారం మాదకద్రవ్యాల వినియోగంకు వ్యతిరేకంగా నిర్వహించిన అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు. సీఐ రవికుమార్, ఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
వ్యసనాలకు బానిసలు కావద్దు
డోర్నకల్: యువత మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని డోర్నకల్ సీఐ బి.రాజేష్ కోరారు. స్థానిక పోలీస్‌స్టేషన్ ఆవరణలో బుధవారం డ్రగ్స్, మత్తు పదార్థాలపై స్థానికులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై గడ్డం ఉమా, ఏఎస్సై కోటేశ్వరరావు పాల్గొన్నారు.
కురవి: మత్తు యువత భవిష్యత్‌ను చిత్తుచేస్తుందని ఎస్సై గండ్రాతి సతీష్ అన్నారు. బుధవారం మండలంలోని నేరడ మోడల్ స్కూల్, కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ వలన కలిగే అనర్థాలపై అవగాహన సమావేశం నిర్వహించారు.
గూడూరు: డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రతీ ఒక్కరు పోరాడాలని సీఐ సూర్యప్రకాష్ అన్నారు. మండల కేంద్రంలోని అరవింద, ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో బుధవారం డ్రగ్స్ వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై గిరిధర్‌రెడ్డి, పీఎస్సై, ఏఎస్సై, హెడ్‌కానిస్టేబుల్, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
యువత సన్మార్గంలో పయనించాలి
నెహ్రూసెంటర్: యువత, విద్యార్థులు డ్రగ్స్, చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ సన్మార్గంలో పయనించాలని టౌన్ సీఐ జి.మహేందర్‌రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచిస్తూ పోస్టర్లను ఆవిష్కరించారు.
కొత్తగూడ: మండలంలోని క్రీడా పాఠశాల, ఏకలవ్య గురుకుల జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఎస్సై కుశకుమార్ మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన కల్పించారు.

మాదకద్రవ్యాలతో జీవితాలు చిన్నాభిన్నం