
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మహబూబాబాద్ రూరల్: గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక బృందాల మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ అన్నారు. మానుకోట జిల్లా సమాఖ్య కార్యాలయంలో ఆర్‌ఏఎంపీ అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈసందర్భంగా అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఎస్‌హెచ్‌జీ బృందాల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఒక రోజు అవగాహన సదస్సు నిర్వహించామని తెలిపారు. ఔత్సాహిక మహిళలకు అవగాహన సదస్సు అనంతరం పదిహేను రోజుల పరిశ్రమ నిర్వహణ, ఉత్పత్తుల మార్కెటింగ్ మెలకువలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారని తెలిపారు. ఈ సదస్సులో జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ శ్రీమన్నారాయణ, ఏపీఎంలు తిలక్, శ్రీనివాసరావు, బాబు, జిల్లా సమాఖ్య అధ్యక్షులు, అలీప్ కమిటీ సభ్యురాలు, అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
తొర్రూరు: మహిళలు పారిశ్రామికవేత్తలు ఎదగాలని అలీప్ సంస్థ చైర్‌పర్సన్ రజినికుమారి తెలిపారు. డీఆర్‌డీఏ, అలీప్ సంస్థల ఆధ్వర్యంలో బుధవారం డివిజన్ కేంద్రంలోని రైతువేదికలో మహిళా స్వయం సహాయక సభ్యులకు చిరు పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఏపీఎం సంజీవరావు, సంస్థ కోఆర్డినేటర్ రాధ, ఏపీఎం వీరయ్య, డీఆర్‌డీఏ ఈజీఎంఎం గణేష్ పాల్గొన్నారు.
అడిషనల్ డీఆర్డీఓ శ్రీనివాస్