
ఎమర్జెన్సీతో కాంగ్రెస్ నిరంకుశ పాలన
మహబూబాబాద్ అర్బన్: కాంగ్రెస్ పార్టీ నిరంకుశ పాలనకు ఆనాటి ఎమర్జెన్సీ విధించడం కాంగ్రెస్ పార్టీ చేసిన చారిత్రక తప్పిదమని బీజేపి జిల్లా కౌన్సిల్ సభ్యులు గడ్డం అశోక్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం పట్టణ అధ్యక్షుడు వెన్నమల అజయ్ అధ్యక్షతన ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి గడ్డం అశోక్ కుమార్ హాజరై మాట్లాడుతూ.. ఇందిరాగాంధీ ప్రభుత్వం నిరంకుశంగా ప్రభుత్వ సొమ్మును వాడుకొని ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె గెలుపునకు అలహాబాద్ కోర్టు చెల్లదని తీర్పు ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్యామ్ సుందర్ శర్మ, సందీప్, పట్టణ నాయకులు నరేష్ నాయక్, నాయని కృష్ణమోహన్, సుధాకర్, రవి, శ్యాంప్రసాద్ పాల్గొన్నారు.
కేసముద్రం: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీ చీకటి అధ్యాయానికి నేటితో 50 ఏళ్లు అయిందని బీజేపీ మండల అధ్యక్షుడు ఉప్పునూతల రమేశ్ విమర్శించారు. బుధవారం మున్సిపల్ కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి వోలం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు రడం వెంకన్న, సహాయ కార్యదర్శి రామడుగు వెంకటాచారి, నాగేశ్వరాచారి పాల్గొన్నారు.