
బడుల అభివృద్ధికి సహకారం అవసరం
కురవి: ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఉత్తమ బోధన అందుతున్నదని బడుల అభివృద్ధికి దాతలు, తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. పాఠశాలలో హెచ్‌ఎం తేలుకుంట్ల సునీత అధ్యక్షతన జరిగిన బడిబాట 2025–2026 విద్యాసంవత్సరానికి గాను ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే 54 మంది విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలో చేర్చుకున్నారు. విద్యార్థులను బడిలో చేర్పించిన హెచ్‌ఎం సునీతను, బడిబాటలో పాల్గొని విద్యార్థుల నమోదు కోసం కృషి చేసిన నామ వెంకటేశ్వర్లు, దైద వెంకటేశ్వర్లు, లోడంగి పురుషలింగం, పత్తేపురపు నాగరాజు, పయ్యావుల వెంకటేశ్వర్లు, ఈడిగిరాల విష్ణువర్థన్, పొన్నం ఉపేందర్, కన్నోజు నవీన్, బరిగెల ఉమ, చెరుకుపల్లి పద్మలను సన్మానించారు. కార్యక్రమంలో ఎంఈఓ వి.బాలాజీ, హెచ్‌ఎంలు మధుసూదన్ రెడ్డి, షమదాన్వాడీ పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి