
పండుగకు సరుకులు కొనడానికి వస్తూ.. మృత్యుఒడికి
చిట్యాల : మొహర్రం పండుగ కు సరుకులు కొనడానికి వస్తు న్న ఇద్దరు యువకులు మృత్యుఒడికి చేరారు. డీసీఎం, బైక్ ఢీకొన్న ప్రమాదంలో అ క్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం బుధవా రం సాయంత్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చి ట్యాల మండలం ఏలేటిరామయ్యపల్లి గ్రామ శివా రు కర్ణాలకుంట వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నవాబుపేటకు చెందిన ఎండి.హకీం పాషా(20), కై లాపూర్‌కు చెందిన సకినాల కుమారస్వామి (21) పని నిమిత్తం బైక్‌పై నవాబుపేట నుంచి చిట్యాలకు వస్తున్నారు. ఈ క్రమంలో చిట్యాల నుంచి నవాబుపేట వైపునకు వెళ్తున్న డీసీఏం కర్ణాలకుంట వద్ద ఎదురుగా ఢీకొ న్నాయి. ఈ ప్రమాదంలో ఎండి. హకీం పాషా, కుమారస్వామి అక్కడికక్కడే దుర్మరణం చెందారు. కాగా, కుమారస్వామి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఎండి.హకీం పాషా గ్రా మంలో ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. నవాబు పేటలో ప్రతీ సంవత్సరం జరిగే మొహర్రం వేడుకలకు కుమారస్వామి హాజ రయ్యేవాడు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు తన స్వగ్రామం కైలా పూర్ వచ్చాడు. ఈ క్రమంలో కమారస్వామి నవాబుపేటకు వె ళ్లాడు. అనంతరం ఇద్దరు కలిసి మెహర్రం పండుగకు కావాల్సి న సరుకులు కొనుగోలు చేసేందుకు బైక్‌పై చిట్యా లకు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ స మాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. ఇద్దరి మృత దేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు. ఈ విషయం తెలుసుకున్న చిట్యాల ఎస్సై –2 ఈశ్వర య్య సిబ్బందితో కలిసి ఘటనా స్థలికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను సివిల్ ఆస్పత్రికి తరలించారు. కాగా, డీసీఎం డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
డీసీఎం, బైక్ ఢీ.. అక్కడికక్కడే ఇద్దరు యువకుల దుర్మరణం
కర్ణాలకుంట వద్ద ఘటన

పండుగకు సరుకులు కొనడానికి వస్తూ.. మృత్యుఒడికి