
రాష్ట్రస్థాయిలో 3వ స్థానం
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగైన విద్య, ఉత్తమ ఫలితాలతో ముందుకు సాగుతున్నాం. ఎక్కడ అధ్యాపకుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, వృత్తి, జనరల్ కోర్సుల్లో ఉత్తమ ఫలితాలు సాధించాం. దాతల సహకారంతో గత ఏడాది వార్షిక పరీక్షల సమయంలో కళాశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశాం. సప్లిమెంటరీ పరీక్ష ఫలితాల్లో రాష్ట్రంలోనే జిల్లా 3వ స్థానం సాధించింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరాలి.
– సీహెచ్.మదార్ గౌడ్, డీఐఈఓ