డోర్నకల్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నామని డీఈఓ రవీందర్ రెడ్డి పేర్కోన్నారు.డోర్నకల్ మండల చివారు చిలుకోడు చివారు మోడల్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన అటల్ ఒకేషనల్ ల్యాబ్‌లను బుధవారం డీఈఓ ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం పుస్తకాలు, నోట్ పుస్తకాలు, భోజనం ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్వశిక్ష అభియాన్ కోఆర్డినేటర్ సతీష్, కాంప్లెక్స్ హెచ్‌ఎం వీరభద్రరావు, స్కూల్ ప్రిన్సిపాల్ కృష్ణ భాను తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలను పర్యవేక్షించాలి
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ పాఠశాలలను నిత్యం పర్యవేక్షించాలని, ఇందుకు డీఈ ఓ, ఎంఈఓ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎంలను వినియోగించుకోవాలని, అవసరమైన చోట అ దనపు పోస్టులు మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మురళీకృష్ణ అన్నా రు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలికల పాఠశాలలో బుధవారం టీఎస్ యూటీఎఫ్ సభ్యత్వ నమోదు నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులను తనిఖీ అధికారులుగా నియమిస్తే క్యాడర్, సీనియారిటీ సమస్యలు వస్తాయని, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు. మండల రిసోర్స్ పర్సన్స్‌గా ఉపాధ్యాయులను నియమించినప్పుడు వచ్చిన ప్రతికూల ఫలితా లను దృష్టిలో ఉంచుకొని మరోసారి అటువంటి విఫల ప్రయోగాన్ని ఉపసంహరించుకోవా లని కోరారు. జిల్లా కార్యదర్శి హరినాయక్, మండల అధ్యక్ష, కార్యదర్శులు కుమార్, రాజశేఖర్, నాయకులు శ్రీనివాస్, సోమేశ్వర,షబ్బీర్, భారత్,రాంబాబు, వీరబ్రహ్మం పాల్గొన్నారు.
ఏపీ ట్రిపుల్ ఐటీకి కల్వల విద్యార్థిని ఎంపిక
కేసముద్రం: మండలంలోని కల్వల జెడ్పీ హై స్కూల్‌కు చెందిన విద్యార్థిని యాసారపు వెన్నె ల పదో తరగతిలో 567 మార్కులు సాధించి ట్రిపుల్ ఐటీకి ఎంపికై ంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనెల 23న ప్రకటించిన ట్రిపుల్ ఐటీ జాబితాలో విద్యార్థిని వెన్నెల ఒంగోలు క్యాంపస్‌కు ఎంపికై నట్లు హెచ్‌ఎం బండారు నరేందర్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు కార్యాచరణ
తొర్రూరు: శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. డివిజన్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌ను బుధవారం ఎస్పీ సందర్శించారు. కేసుల పురోగతి, శాంతి భద్రతల అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ ఆధ్వర్యంలో పుణ్య క్షేత్రాలకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ముద్రించిన పోస్టర్లను డీఎం పద్మావతితో కలిసి ఎస్పీ ఆవిష్కరించారు. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా నేరాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అన్నారు. మాదకద్రవ్యాల నియంత్రణకు కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. గంజాయి తరలించేవారు ఎంతటివారైనా గుర్తించి కేసులు నమోదు చేస్తామన్నారు. డీఎస్పీ కృష్ణకిశోర్, సీఐ గణేశ్, ఎక్సైజ్ సీఐ అశోక్, ఎస్సై ఉపేందర్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్‌ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్‌లో మజ్దూర్ యూనియన్‌తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్‌ఎం పీఎన్‌ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మికులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలను ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్‌ఎం హామీ ఇచ్చినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్‌లో క్యాంటీన్ విస్తరణకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు రవీందర్ వివరించారు.