
విద్యా ప్రమాణాలు మెరుగు!
మహబూబాబాద్ అర్బన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపడడంతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. ప్రైవేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోంది. దాతల సహకారంతో మధ్యాహ్నం భోజనం, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నాణ్యమైన విద్య అందుతోంది. దంతో పేద విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కళాశాలల అధ్యాపకులు గ్రామాల్లో తిరుగుతూ విద్యార్థుల నమోదు ప్రక్రియ చేపడుతున్నారు.
ప్రత్యేకతలు..
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో డిప్లొమా వృత్తి విద్యా కోర్సులు సీటీ, ఈటీ, ఎంఈటీ, ఎంఎల్‌టీ గ్రూపులు ఉన్నాయి. అలాగే ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ గ్రూపులు ఉండగా బాలబాలికలకు ప్రత్యేక వసతులు ఉన్నాయి.
1970లో ప్రారంభం..
మహబూబాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల 1970 సంవత్సరంలో ప్రారంభమైంది. 55 ఏళ్లుగా గ్రామీణ, పట్టణ నిరుపేద విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతోంది. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు కలెక్టర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఉపాధ్యాయులు, లాయర్లు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులు ఉన్నత స్థాయిలో ఉన్నారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
ఉచిత విద్య, పాఠ్యపుస్తకాల పంపిణీ
దాతల సహకారంతో
విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
అడ్మిషన్లు చేపడుతున్న అధ్యాపకులు
జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల 2024–25వార్షిక ఫలితాల వివరాలు
ఇయర్ పరీక్ష రాసిన పాసైన ఉత్తీర్ణత
విద్యార్థులు విద్యార్థులు శాతం
ఫస్టియర్ జనరల్ 2083 1497 71.8
ఫస్టియర్ ఒకేషనల్ 458 344 75.1
సెకండియర్ జనరల్ 1270 974 76.6
సెకండియర్ ఒకేషనల్ 347 270 77.8

విద్యా ప్రమాణాలు మెరుగు!