
మందులు అందుబాటులో ఉంచుకోవాలి
బయ్యారం: వానాకాలంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తిచెందే అవకాశం ఉంటుందని, పీహెచ్‌సీల్లో మందులు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ వైద్య సిబ్బందికి సూచించారు. మండలంలోని బయ్యారం, నామాలపాడు గ్రామాల్లో బుధవారం ఆయన పర్యటించారు. బయ్యారం పీహెచ్‌సీని తనిఖీ చేసి రోగుల బెడ్లు, మందుల గది, టీకాల గదిని పరిశీలించారు అనంతరం సిబ్బ ందితో మాట్లాడుతూ.. ఏజెన్సీ గ్రామాల ప్రజ లకు వైద్య సేవలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. మండలంలో పైలె ట్ ప్రాజెక్ట్‌గా ఎంపికై న నామాలపాడులో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను కలెక్టర్ పరిశీలించారు. మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదా రులకు రూ.లక్ష చొప్పున బ్యాంకు రుణం మంజూరు చేయాలన్నారు. తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఏఓ రాంజీ పాల్గొన్నారు.
లక్ష్యాలను పూర్తి చేయాలి
మహబూబాబాద్: ఆయిల్‌పామ్ పంట సాగు విస్తీర్ణ లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో బుధవారం వ్యవసాయం, హార్టికల్చ ర్, సహకార శాఖ, ఫర్టిౖలైజర్ తదితర అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆయిల్ పామ్ పంట సాగుపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సబ్సిడీ రాయితీలను రైతులకు వివరించాలన్నారు. జిల్లాలో 4,500 ఎకరాల లక్ష్యం కాగా ఇప్పటి వరకు 542 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేశారన్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా, ఇతర ఎరువులను సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, డీఏఓ విజయనిర్మల, ఉద్యావశాఖ అధికారి మరియన్న పాల్గొన్నారు.
చర్యలు తీసుకోవాలి..
భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వ సూచనల ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో భూ భారతి దరఖాస్తులు, ఇతర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి రెవెన్యూ చట్టా న్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రెవె న్యూ సదస్సులు ముగిశాయని, తర్వాత నోటీస్‌లు అందజేసి విచారణ చేపట్టి, భూసమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. జిల్లాలో 39,513 దరఖాస్తులు వచ్చాయన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్