
క్రెడాయి నూతన కార్యవర్గం ఎన్నిక
నయీంనగర్: దేశంలో ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరుగాంచిన ‘ది కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (క్రెడాయి) ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. చైర్మన్‌గా ఎర్రబెల్లి తిరుపతి రెడ్డి, అధ్యక్షుడిగా నాయిని అమరేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ ఎలక్టెడ్‌గా కంది శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శాఖమూరి అమర్, ఉపాధ్యక్షులుగా రాజేందర్ రెడ్డి, రజనీకాంత్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కోశాధికా రిగా వరుణ్‌కుమార్ అగర్వాల్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ గా రాజ్‌కుమార్, సంయుక్త కార్యదర్శులుగా కొండా రెడ్డి, నాగరాజు, మల్లారెడ్డి, తదితర పాలకవర్గ స భ్యులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సమావేశానికి క్రెడాయి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రేమ్ సాగర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూ తన కార్యవర్గాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగంలో పారదర్శకత, నాణ్యత, వినియోగదారుల విశ్వా సం నిలబెట్టే దిశగా క్రెడాయి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అనంతరం నూతన చైర్మన్ తిరుపతి రెడ్డి, అధ్యక్షుడు నాయిని అమరేందర్ రెడ్డి మా ట్లాడుతూ నిర్మాణ రంగం ప్రాంతీయ అభివృద్ధికి కీలక చక్రంగా నిలుస్తుందన్నారు. నూతన కార్యవర్గం స్థిరాస్తి రంగాన్ని మరింత న్యాయంగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుందన్నారు. కస్టమర్ల విశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వ సంస్థలతో సమన్వయం, బిల్డర్ల సమస్యల పరిష్కారం కోసం క్రెడాయి అంకితభావంతో పనిచేస్తుందన్నారు. ‘కుడా’, డీటీసీపీ, జీడబ్ల్యూఎంసీ వంటి సంస్థలతో సమన్వయానికి క్రెడాయి పటిష్ట వే దికగా నిలుస్తుందని తెలిపారు. పరిశుభ్రత, నా ణ్య త, నిబంధనలు పాటిస్తామన్నారు. త్వరలో చిన్న డెవలపర్లకు ప్రోత్సాహం, యూత్ ఆర్మ్, మహిళా బిల్డర్లకు ప్రాధాన్యం, వృత్తిపర శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయని వారు పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నాయిని అమరేందర్ రెడ్డి