
రైతులు పంట మార్పిడి చేపట్టాలి
మహబూబాబాద్ రూరల్ : రైతులు పంట మార్పిడి చేపట్టాలని, వరి, మిర్చి, పత్తికి ప్రత్యామ్నాయంగా కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్ సాగు చేపట్టాలని మహబూబాబాద్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. ఈమేరకు పంటమార్పిడి విధానం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు పలు సూచనలు చేశారు. పంట మార్పిడితో రైతులకు ఆదాయ మార్గాలు ఏర్పడుతాయని, మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగుచేసి ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. మహబూబాబాద్ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తూ పలువురు రైతులు ఎకరానికి రూ. లక్షకు పైగా ఆదాయం పొందుతున్నారన్నారు.
యాజమాన్య పద్ధతులు పాటించాలి..
బోర్ల కింద కూరగాయలు, పండ్లు, ఆయిల్ పామ్, పూలు, మల్బరీ, పలు రకాల ఉద్యాన పంటలు సాగు చేయాలన్నారు. ప్రతీ రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటల్లో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలన్నారు. కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని మరియన్న తెలిపారు.
మార్కెట్ డిమాండ్ ఉన్న పంటలు సాగుచేయాలి
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న

రైతులు పంట మార్పిడి చేపట్టాలి

రైతులు పంట మార్పిడి చేపట్టాలి