
నిరంతర వైద్య సేవలు అందించాలి
● కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్
నెహ్రూసెంటర్: వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సీజనల్ వ్యాధులతో ఆస్పత్రికి వచ్చే రోగులకు ని రంతరం నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ అన్నారు. జిల్లా ప్రభు త్వ జనరల్ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..ఆస్పత్రిలో కావాల్సిన మందులను సిద్ధం చే సుకోవాలని, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఎప్పటికప్పుడు శానిటేషన్ నిర్వహించాలని సూచించారు. ఆస్పత్రిలో మెడికల్, ఫీవర్, క్యాజువాలిటీ, ఐసీయూ,మెడికల్‌కేర్, పిడియాట్రిక్, జనరల్ సర్జిక ల్ వార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రి, మెడికల్ కళాశాల నిర్మాణ పనులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతంగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్లు సమన్వయంతో పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివా సరావు, ఆర్‌ఎంఓ జగదీశ్వర్ పాల్గొన్నారు.